Current Affairs Telugu Daily

తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం 
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2018 డిసెంబర్‌ 13న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు.
  • ఆయనతో పాటు మంత్రిగా మహమూద్‌ అలీ కూడా ప్రమాణం చేశారు. కేసీఆర్‌ తెలుగులో ప్రమాణం చేయగా, మహమూద్‌అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. మహమూద్‌ అలీకి సీఎం అత్యంత కీలకమైన హోంమంత్రిత్వ శాఖను కేటాయించారు. 
  • 2018 సెప్టెంబర్‌ 6న తెలంగాణ తొలి శాసనసభ రద్దయిన 97 రోజుల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 2018 డిసెంబర్‌ 7న ఎన్నికలు నిర్వహించగా 11న ఫలితాలు వెల్లడయ్యాయి. 88 స్థానాలను సాధించడంతో టీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ఆహ్వానించారు. సీఎం ప్రమాణ స్వీకారంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినట్లయింది.
  • ఇప్పటికే 8 సార్లు శాసనసభకు, 5 సార్లు లోక్‌సభకు ఎన్నికైన కేసీఆర్‌ రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన వారి సరసన చేరారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 2014 జూన్‌2న బాధ్యతలు చేపట్టి 51 నెలలపాటు పని చేశారు.  
  • అనంతరం 3 నెలలపాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి డిసెంబర్‌ 13న మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 
  • ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలో రెండు దఫాలు అంతకంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతల వివరాలు..
  • మర్రి చెన్నారెడ్డి (కాంగ్రెస్‌): రెండుసార్లు సీఎం పదవి చేపట్టారు. మొదటి సారి 1978 మార్చి 6 నుంచి 1980 అక్టోబరు 11 వరకు 2 సంవత్సరాలు 19 రోజుల ఉన్నారు. రెండోసారి 1989 డిసెంబరు మూడో తేదీ నుంచి 1990 డిసెంబరు 17 వరకు సంవత్సరం 14 రోజులపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
  • కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కాంగ్రెస్‌): మొదటిసారి 1982 సెప్టెంబరు 20 నుంచి 1983 జనవరి 9 వరకు 111 రోజు, రెండోసారి 1992 అక్టోబరు 9 నుంచి 1994 డిసెంబరు 12 వరకు 2 సంవత్సరాలు 64 రోజులపాటు సీఎంగా వ్యవహరించారు.
  • నందమూరి తారకరామారావు (టీడీపీ): నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మొదటిసారి 1983 జనవరి 9 నుంచి 1984 ఆగస్టు 16 వరకు పదవిలో ఉన్నారు. రెండోసారి 1984 సెప్టెంబరు 16 నుంచి 1985 మార్చి 9 వరకు 174 రోజు, మూడోసారి 1985 మార్చి 9 నుంచి 1989 డిసెంబరు రెండో తేదీ వరకు 4 సంవత్సరా 269 రోజు, నాలుగోసారి 1994 డిసెంబరు 12 నుంచి 1995 సెప్టెంబరు 1 వరకు 263 రోజు పదవిలో కొనసాగారు.
  • నారా చంద్రబాబునాయుడు (టీడీపీ): మొదటి సారి 1995 సెప్టెంబరు 1 నుంచి 2004 మే 14 వరకు రెండు విడతలుగా, మూడోసారి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014 జూన్‌ 8 నుంచి సీఎంగా కొనసాగుతున్నారు.
  • వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(కాంగ్రెస్‌): 2004 మే 14 నుంచి పూర్తికాలం పాటు, 2009 మే నుంచి సెప్టెంబరు 2 వరకు
  • కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(టీఆర్‌ఎస్‌): తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రత్యేక రాష్ట్రంలో మొదటిసారి 2014 జూన్‌ 2 నుంచి 2018 డిసెంబరు 12 వరకు. రెండోసారి 2018 డిసెంబరు 13 నుంచి

views: 850

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams