Current Affairs Telugu Daily

నీరుకొండలో 200 ఎకరాల్లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు 
రాజధాని అమరావతి నీరుకొండలోని ఎత్తైన కొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ స్మారక(మెమోరియల్‌) ప్రాజెక్టు ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు.
  • కొండపై 32 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్‌ కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పర్యాటక ఆకర్షక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు ఏర్పాటుచేసే కొండ చుట్టూ జలాశయాన్ని నిర్మించి ప్రాజెక్టు ప్రాంతాలను దీవిలా తీర్చిదిద్దుతారు.
  • ఈ ప్రాజెక్టు ఆకృతులను ఎల్‌అండ్‌టీకి చెందిన ‘డిజైన్స్‌ అసోసియేట్స్‌’ సంస్థ రూపొందించింది. 46 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని చాలావరకు విరాళాల ద్వారా సేకరిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటుచేస్తారు.
ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు ముఖ్యాంశాలు.. 
  • నీరుకొండలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహం లోపలి భాగంలో పైవరకు వెళ్లి అక్కడినుంచి నగరాన్ని వీక్షించవచ్చు. సందర్శకులు పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లుంటాయి. 
  • జలాశయం దాటి కొండ వద్దకు చేరుకోడానికి బోట్లు ఏర్పాటు చేస్తారు. వాహనాలో వెళ్లేందుకు కాజ్‌వే కూడా ఉంటుంది. ప్రాజెక్టులో ప్రధానంగా పది విభాగాలుంటాయి. 
  • కొండ దిగువ ప్రాంతంలో ఒక ప్రధాన జెట్టీ ఉంటుంది. అక్కడే ఒక ఫనిక్యుర్‌ రైల్వేస్టేషన్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, రెస్ట్‌రూమ్‌లు, ఫుడ్‌కోర్టు, సెల్ఫీపాయింట్‌ ఉంటాయి. 
  • కొండ దిగువ నుంచి కొండపైకి చేరుకోడానికి ఫనిక్యుర్‌ రైలు ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలపైకి వెళ్లేందుకు ట్రాక్‌పై నడిచే కారునే ఫనిక్యుర్‌ ట్రైన్‌ అంటారు. 
  • ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేసే భవనంలో.. మ్యూజియం, ఆడిటోరియం, కేఫ్‌, ఫనిక్యుర్‌ స్టేషన్‌ ఉంటాయి. 
భవనం పక్కనే ఒక యాంఫీ థియేటర్‌ ఉంటుంది. 
  • కాజ్‌వే నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేసిన భవనం వరకు వాహనాల్లో చేరుకోడానికి రోడ్డు మార్గం ఉంటుంది. 
  • కొండపైకి వెళ్లేందుకు నడక మార్గం, రెండో జెట్టీ వంటివి ఏర్పాటుచేస్తారు. 
  • కొండపై అరుదైన వృక్షజాతులతో ఉద్యానవనం ఏర్పాటుచేస్తారు.
ప్రాజెక్టు ప్రత్యేకతలు
  • విగ్రహం ఏర్పాటుకు 14 ఎకరాలు కేటాయిస్తారు. నీరు కొండ చుట్టూ 7080 ఎకరాల్లో జలాశయం నిర్మిస్తారు. మొత్తం ప్రాజెక్టును 200 ఎకరాల్లో చేపడతారు. 
  • ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని అంచనా. విగ్రహం నిర్మాణానికి రూ.155 కోట్లు, విగ్రహం ఏర్పాటుచేయడానికి నిర్మించే భవనానికి మరో రూ.112.5 కోట్లు ఖర్చవుతాయి. 
  • 42 మీటర్ల ఎత్తైన, 9700 చ.మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాన్ని నిర్మిస్తారు. జీం3 విధానంలో నిర్మించే ఈ భవనంపై టెర్రాస్‌ ఉంటుంది. దానిపై పోడియం వస్తుంది. భవనం సెంట్రల్‌ కోర్‌పై ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేస్తారు. టెర్రాస్‌ ఓపెన్‌గా ఉంటుంది.

views: 793

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams