Current Affairs Telugu Daily

మయన్మార్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 డిసెంబర్‌ 12న మయన్మార్‌లోని రెండు నగరాల్లో పర్యటించారు.
  • మయన్మార్‌ రైతు కోసం రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. వ్యవసాయ విద్య, పరిశోధనను ప్రోత్సహించేందుకు యెజిన్‌ వర్సిటీలో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు.
  • ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ పర్యవేక్షణలో నేపీటౌలో ఏర్పాటుచేసిన రైస్‌ బయో పార్క్‌ను ప్రజలకు అంకితమిచ్చారు. యాప్‌నకు ‘గ్రీన్‌ వే’గా నామకరణం చేశారు. దీన్ని దాదాపు లక్షమంది ఉపయోగిస్తున్నారు.
  • పాడిపంటల సమాచారంతోపాటు 2000 మందికిపైగా వ్యవసాయ నిపుణులను రైతులకు ఇది చేరువ చేస్తోంది. 

views: 721



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams