Current Affairs Telugu Daily

ధన్‌రాజ్‌ పిళ్లైకి భారత్‌ గౌరవ్‌ పురస్కారం
భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ ధన్‌రాజ్‌ పిళ్లై అత్యంత
ప్రతిష్టాత్మకమైన భారత్‌ గౌరవ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.
    పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫుట్‌ బాల్‌ క్లబ్‌ ప్రదానం
చేసే ఈ పురస్కారాన్ని. క్లబ్‌ వ్యవస్థాపక దినమైన ఆగస్టు 1వ తేదీన
ప్రదానం చేయనున్నారు. భారత హాకీ జట్టుకు అందించిన
అపారమైన సేవలకు గుర్తింపుగా 2017 సంవత్సరానికిగాను పిళ్లైని
ఈ పురస్కారానికి ఎంపిక చేశామని జూన్‌ 27న ఏర్పాటు చేసిన ఓ
కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి కళ్యాణ్‌ మజందార్‌
    వెల్లడించారు. క్లబ్‌ మాజీ ఫుట్‌ బాల్‌ క్రీడాకారులు
సయ్యద్‌ నయీముద్దిన్‌, శుభాష్‌ బౌమిక్‌లకు లెఫ్‌టైమ్‌
ఎచీవ్‌మెంట్‌ అవార్డును అందజేయనున్నట్లు చెప్పారు. ఆధునిక
భారతీయ హాకీ జట్టులో అతిపెద్ద స్టార్‌గా నిలిచిన పిళ్లై తన 15 ఏళ్ల
క్రీడా జీవితంలో అనేక అంతర్జాతీయ వేదికలపై ఒలిపిక్స్‌తో
పాటు ప్రపంచ టోర్నీలు, చాంపియన్‌ ట్రోఫీలు, ఏషియన్‌
గేమ్స్‌లలో ఆడారు. మొత్తం 339 మ్యాచ్‌ల్లో 170 గోల్స్‌ సాధించి,
అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు.

views: 1085

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams