Current Affairs Telugu Daily

ప్రవాసులు స్వదేశాలకు పంపే నగదు(రెమిటెన్స్)లో భారత్ అగ్రస్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.

నివేదిక  : వలసలు, అభివృద్ధి వార్షిక నివేదిక.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు 2018లో అత్యధికంగా రూ.5.7 లక్షల కోట్ల (8,000 కోట్ల డాలర్లు) నగదును స్వదేశానికి పంపారు. భారత్ తర్వాతి స్థానాల్లో రూ.4.78 లక్షల కోట్లతో చైనా, రూ.2.42 లక్షల కోట్లు చొప్పున మెక్సికో, ఫిలిప్పీన్స్, రూ.1.85 లక్షల కోట్లతో ఈజిప్టు ఉన్నాయి. 2018లో అభివృద్ధి చెందుతున్న దేశాల రెమిటెన్స్ లు అత్యధిక స్థాయిలో 10.8 శాతం మేర పెరిగి రూ.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే అధిక ఆదాయం ఉన్న దేశాల రెమిటెన్స్ లు 10.3 శాతం పెరిగి రూ.49 లక్షల కోట్లకు చేరాయి.     


views: 745

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams