Current Affairs Telugu Daily

మయన్మార్‌ ఆడపిల్లల అక్రమ రవాణా 
చైనాలో స్త్రీ, పురుష నిష్పత్తిలో వ్యత్యాసాలు మయన్మార్‌, కంబోడియా, లావోస్‌, వియత్నాం దేశాలకు చెందిన నిరుపేద మహిళలకు శాపంగా పరిణమించాయి.
  • ఆయా దేశాలకు చెందిన పేద యువతులు చైనాకు అక్రమంగా రవాణా అయిపోతున్నట్లు ఓ అధ్యయనం పేర్కొంది.
  • దశాబ్దాల తరబడి చైనాలో కొనసాగిన ‘ఏకైక సంతానం’ విధానంతో అక్కడి స్త్రీ, పురుషుల జనాభాలో చాలా వ్యత్యాసం చోటు చేసుకుంది. దానిని భర్తీ చేసుకునేందుకే యువతులు అక్రమరవాణాకు చైనా సమాజం తెరచాపలెత్తేసిందని తెలిపింది.
  • ‘జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. కొందరు ఇష్టపూర్వకంగా వెళుతుంటే మరికొందరు అమాయకంగా  అక్రమరవాణా ఉచ్చులో చిక్కుకుని చైనాలో బందీలైపోతున్నారు.
  • తల్లిదండ్రులు, ఊరిపెద్దలు బ్రోకర్ల ద్వారా బలవంతపు వివాహాలు జరిగిపోతున్నట్లు పరిశోధకులు తెలిపారు.

views: 751

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams