100 మంది అత్యంత శక్తిమంత మహిళతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో మన దేశం నుంచి నలుగురికి చోటు లభించింది.
హెచ్సీఎల్ టెక్ సీఈఓ రోష్ని నాడార్, బయోటెక్నాలజీ దిగ్గజం కిరణ్ మజుందార్ షా, ప్రసార మాధ్యమా నుంచి శోభనా భర్తియా, బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.జర్మనీ ఛాన్సర్ ఏంజెలా మెర్కెల్ (64) ప్రథమ స్థానంలో నిలిచారు.
బ్రిటన్ ప్రధాని థెరెసా మే (62) వరుసగా రెండో ఏడాదీ 2వ స్థానంలో నిలిచారు. ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ గార్డే (3), జనరల్ మోటార్స్ సీఈఓ మేరి బర్రా (4), ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈఓ అబిగైల్ జాన్సన్ 5వ స్థానంలో ఉన్నారు.
హెచ్సీఎల్ టెక్ సీఈఓ అయిన రోష్ని నాడార్ మల్హోత్రా (37) 51వ స్థానంలో నిలవగా బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ అయిన కిరణ్ మజుందార్ షా (65)కు 60వ స్థానం దక్కింది.
హెచ్టీ మీడియా సీఎండీ భర్తియా (61)కి 88వ స్థానం లభించింది. నటి ప్రియాంకా చోప్రా (36)కు 94వ స్థానం దక్కింది. ఈమె చిత్ర నిర్మాణంతో పాటు టెక్ సంస్థల్లో పెట్టుబడులూ పెడుతున్నారు.