Current Affairs Telugu Daily

‘వ్యవసాయ ఎగుమతి విధానం-2018’కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం 
ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత్‌ వాటాను రెట్టింపు చేయాలని, విదేశీ మార్కెట్లలో ఎగుమతి అవకాశాల ద్వారా రైతు ప్రయోజనాలు పొందేలా చేయాలనే లక్ష్యాతో రూపొందించిన ‘వ్యవసాయ ఎగుమతి విధానం-2018’కి కేంద్ర మంత్రివర్గం 2018 డిసెంబర్‌ 6న ఆమోదం తెలిపింది.
  • వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుతం రూ.2.12లక్షల కోట్లుగా ఉండగా, 2022 నాటికి సుమారు రూ.4.25 లక్షల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు.
  • వ్యవసాయ ఎగుమతి విధానాన్ని వ్యూహాత్మక, నిర్వహణాత్మక అనే రెండు విభాగాలుగా విభజించారు. వ్యూహాత్మక విభాగంలో విధానపరమైన చర్యలు, మౌలిక సదుపాయాలు, రవాణా సహకారం, ఎగుమతుల్ని పెంచేందుకు సమగ్ర వైఖరి, రాష్ట్ర ప్రభుత్వాల్ని మమేకం చేయడం వంటి అంశాలున్నాయి.
  • నిర్వహణాత్మక విభాగంలో సముదాయాల ఏర్పాటు, విలువ ఆధారిత ఎగుమతులకు ప్రోత్సాహం, మార్కెటింగ్‌, భారత బ్రాండ్‌ను పెంపొందించడం, ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించడం, నాణ్యత ప్రమాణాల్ని నెలకొల్పడం, పరిశోధన, అభివృద్ధి వంటి కార్యకలాపాలు నిర్వహించడం వంటివున్నాయి.
  • వ్యవసాయ ఎగుమతి విధానంఅములును పరిశీలించేందుకు కేంద్రం స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయాలనే ప్రతిపాదననూ మంత్రివర్గం ఆమోదించింది.

views: 773

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams