Current Affairs Telugu Daily

ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో నామమాత్ర రుసుముతో సామాన్యులకు సేవలు 
కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల్లో వైద్యసేవల్ని ఇకపై సాధారణ ప్రజానీకం కూడా ఉపయోగించుకోవచ్చు.
  • 2018 డిసెంబర్‌ 6న  కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) 176వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు చౌకధరలో నాణ్యమైన వైద్యం అందడమే కాకుండా, ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం సాధ్యమవుతుందని కార్మిక శాఖ  వెల్లడించింది.
  • రద్దీ లేని ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల్లో బయటి రోగుల విభాగంలో వైద్యసేవలకు రూ.10 చొప్పున వినియోగ రుసుము వసూలు చేయాలని, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందేవారికి కేంద్రప్రభుత్వ ఆరోగ్య సేవ ప్యాకేజీ ధరల్లో 25 శాతాన్ని రుసుముగా వసూలు చేయాలని నిర్ణయించారు. మందును సైతం వాస్తవ ధరకే అందించాలని నిర్ణయించారు.
  • ప్రయోగాత్మకంగా ఏడాదిపాటు వీటిని అందించనున్నారు. ఈఎస్‌ఐసీకి దేశవ్యాప్తంగా 150 ఆస్పత్రులు ఉండగా, రోగుల కోసం 17 వేల పడకలు అందుబాటులో ఉన్నాయి.
  • కొన్ని ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు పూర్తికాపు సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన తీసుకోవానే నిర్ణయాన్ని ఆమోదించారు. ఉద్యోగుల వాటా చందాను రూ.137 నుంచి రూ.176కు పెంచారు.

views: 689

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams