Current Affairs Telugu Daily

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజాదరణ గల నేతల్లో మోడికి అగ్రస్థానం
సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న ప్రపంచ నేతల్లో ప్రధాని మోడి అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు కోటీ 48 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
  • కోటీ 22 లక్షల మంది అనుసరిస్తున్న ఇండోనేసియా అధ్యక్షుడు జొకోవి 2వ స్థానంలో, కోటి మంది ఫాలోవర్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 3వ స్థానంలో ఉన్నారు. చిత్రాల్లో కూడా ప్రధాని మోడి పోస్ట్‌ చేసిన ఫొటోకే ఎక్కువ ఆదరణ లభించింది.
  • భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య అనుష్కశర్మలు తమ వివాహం అనంతరం ప్రధానిని కలిసినప్పటి ఫొటోను 18,34,707 మంది ఇష్టపడ్డారు.
  • ప్రపంచ ఆర్థిక వేదిక 2018 సందర్భంగా ప్రధాని మోదీ దావోస్‌లో మంచు కురుస్తున్న ఓ బస్టాప్‌ వద్ద నిల్చున్నప్పటి చిత్రం 16,35,978 ‘లైక్‌’తో 2వ స్థానంలో నిలిచింది. ప్రధాని మోడి ఇతర సామాజిక మాధ్యమాలైన ట్విటర్‌, ఫేస్‌బుక్‌లోనూ అత్యంత ప్రజాదరణ ఉన్న ప్రపంచ నేతల్లో ఒకరుగా నిలిచారు.
  • ట్విటర్‌లో 4.3 కోట్ల మందికి పైగా ప్రధానిని అనుసరిస్తుండగా, ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాను 4 కోట్ల మందికి పైగా లైక్‌ చేస్తున్నారు.

views: 664

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams