Current Affairs Telugu Daily

ఇనాక్‌కు కేంద్ర సాహిత్య  అకాడమీ అవార్డు 
‘నా కన్నీళ్లే నా రాతలు’ అని నర్మగర్భంగా పలికే ప్రముఖ రచయిత కొలకూలూరి ఇనాక్‌ రచించిన ‘విమర్శిని’ వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
  • దేశవ్యాప్తంగా 24 భాషలు, మూడు గుర్తింపు లేని భాషలకు సంబంధించి సాహిత్య అకాడమీ 2018 డిసెంబర్‌ 5న డిల్లీలో  ప్రకటించారు. ప్రాచీన, ప్రబంధ సాహిత్యంలో దక్షిణాది విభాగంలో 105 ఏళ్ల వయస్సున్న కర్ణాటకలోని మండ్య జిల్లా శ్రీరంగపట్నకు చెందిన జి.వెంకటసుబ్బయ్యకు సాహిత్య అకాడమీ భాషాసమ్మాన్‌ అవార్డు లభించింది.
  • అవార్డు గ్రహీతను 2019 జనవరి 29న నిర్వహించే కార్యక్రమంలో రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాతో సత్కరిస్తామని చెప్పారు. 2014లో ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన ఆచార్య కొలకూలూరి ఇనాక్‌ 1939 జులై 1న గుంటూరు జిల్లా వేజండ్లలో జన్మించారు.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఆయన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకుపతిగా విధులు నిర్వర్తించారు. ఇనాక్‌ ఇప్పటివరకు సుమారు 180 పద్యాలు, 180 కథలు, తొమ్మిది నవలలు, 30 నాటికు సహా పలు సాహిత్య విమర్శలు, చిన్నారుల సాహిత్యం రచించారు.
  • ఇనాక్‌ రచనలు ఆంగ్లం, హిందీ, కన్నడ, తమిళం, మయాళంలోకి అనువాదమయ్యాయి.
సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ - చంద్రశేఖర్‌ కాంబర్‌ 

views: 899



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams