Current Affairs Telugu Daily

జీశాట్‌-11 ప్రయోగం విజయవంతం    

రాకెట్ పేరు : ఏరియన్‌-5 రాకెట్‌.
ఉపగ్రహం పేరు : జీశాట్‌-11 ('బిగ్‌ బర్డ్‌')
తయారీకి అయిన వ్యయం : రూ.600 కోట్లు.
ప్రయోగించిన తేదీ : 5 డిసెంబర్ 2018
ఎందుకు : దేశంలో పెరుగుతున్న అంతర్జాల వినియోగం, వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచారవ్యవస్థ తదితర అవసరాలను తీర్చేందుకు.
ఎక్కడ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం(దక్షిణ అమెరికా) నుంచి.
జీశాట్‌-11 బరువు : 5,854 కిలోలు.
ఉపగ్రహ కాలపరిమితి : 15 ఏళ్లు
ఇందులోని మల్టీ స్పాట్‌ బీమ్‌ యాంటెనా కవరేజ్‌ దేశంతోపాటు చుట్టుపక్కల దీవుల్లో సేవలు అందించనుంది. 

ఉపయోగాలు :

1) దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు 
2) గ్రామీణ వనరుల కేంద్రాలకు, వివిధ రకాల డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకు, ఈశాట్‌ టెర్మినళ్లకు, ఎంటర్‌ప్రైజ్‌ నెట్‌వర్క్‌, వినియోగదారుల బ్రాడ్‌బ్యాండ్‌ అప్లికేషన్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. 
3) బ్యాండ్‌ విడ్త్‌ కనెక్టివిటీని మరింత రెట్టింపు చేసి గ్రామీణ ప్రాంతాలకు సైతం వేగవంతమైన అంతర్జాల సేవలను చేరువ చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తోంది.


views: 841

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams