Current Affairs Telugu Daily

టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సుమీత్ రెడ్డి-అర్జున్ రామచంద్రన్ జంటకు డబుల్స్ టైటిల్ లభించింది.

ముంబైలో డిసెంబర్ 2న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్-అర్జున్ ద్వయం 21-10, 21-16తో టాప్ సీడ్ గో జె ఫె-నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జోడీపై విజయం సాధించింది.
మరోవైపు మహిళల సింగిల్స్‌లో అస్మిత చలిహా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ చాంపియన్స్ గా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్ 21-15, 21-10తో ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. అలాగే మహిళల సింగిల్స్‌లో గుమ్మడి వృశాలి, మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన-పూర్వీషా రామ్ జోడీ రన్నరప్‌గా నిలిచారు. వృశాలి 16-21, 13-21తో అష్మిత చేతిలో ఓడిపోయింది.


views: 708

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams