Current Affairs Telugu Daily

అల్ట్రా రన్నింగ్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకం 
అల్ట్రా రన్నింగ్‌లో అథ్లెట్‌ ఉల్లాస్‌ నారాయణ్‌ భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకాన్నందించాడు.
  • ఆసియా-ఓషియానియా ఛాంపియన్‌షిప్‌లో అతను కాంస్యం సాధించాడు. అత్యధికంగా 253 కిలోమీటర్లు పరుగెత్తిన యోషిహికో ఇషికావా (జపాన్‌) అగ్రస్థానంలో నిలవగా..  తకహాషి (జపాన్‌, 252 కి.మీ) 2వ స్థానం సాధించాడు.
  • ఉల్లాస్‌ 250 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసి 3వ స్థానంలో నిలిచాడు. కంబైన్డ్‌ డిస్టెన్స్‌లో నారాయణ్‌ (250 కి.మీ), సునీల్‌ శర్మ (202 కి.మీ), మీనా (192 కి.మీ)తో కూడిన భారత జట్టుకు (644 కి.మీ) కూడా కాంస్యం దక్కింది. జపాన్‌ (756 కి.మీ), ఆస్ట్రేలియా (684) తర్వాత భారత్‌ 3వ స్థానంలో నిలిచింది.

views: 779

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams