Current Affairs Telugu Daily

180 కి.మీ. వేగాన్ని అధిగమించిన ట్రైన్‌-18 
దేశీయంగా రూపొందిన తొలి ఇంజిన్‌ రహిత రైలు (ట్రైన్‌-18) 2018 డిసెంబర్‌ 2న ప్రయోగ పరీక్షలో గంటకు 180 కి.మీ. వేగాన్ని అధిగమించింది.
  • రాజస్థాన్‌లోని కోట-సవాయీ మాధోపుర్‌ మార్గంలో దీనిని నడిపినప్పుడు ఈ వేగాన్ని దాటిందని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి.
  • 200 కి.మీ. వేగంతో నడిచేలా రూ.100 కోట్ల వ్యయంతో పూర్తి ఏసీ రైలును చెన్నైలోని ‘సమీకృత రైలు పెట్టె కర్మాగారం’ (ఐసీఎఫ్‌)లో తయారు చేశారు. 

views: 799



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams