Current Affairs Telugu Daily

గూగుల్‌కు రికార్డ్‌ స్థాయిలో భారీ జరిమానా
ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ భారీ జరిమానా విధించింది. గూగుల్‌ అందిస్తోన్న షాపింగ్‌ సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ రికార్డ్‌  స్థాయిలో పెనాల్టీ విధించింది. పలు సంస్థలకు అక్రమంగా లబ్ధిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై ఈయూ సుదీర్ఘ విచారణ నిర్వహించిన అనంతరం 2017 జూన్‌ 27న ఈ ఆదేశాలు జారీ చేసింది. 2.4 బిలియన్‌ యూరోల (2.72 బిలియన్‌ డాలర్లు) జరిమానా విధించింది. గూగుల్‌ తమ సెర్చింజన్‌లో చూపించిన ఆన్‌లైన్‌ షాపింగ్‌ సర్వీస్‌ సంస్థల పేర్లు ఇతర సంస్థలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని తేల్చింది. 90 రోజుల్లోగా సెర్చ్‌లో తన షాపింగ్‌ సర్వీస్‌లకు ఫేవర్‌ చేయడాన్ని నిలిపేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు వచ్చే టర్నోవర్‌లో 5 శాతం పెనాల్టీ వేస్తామని కూడా హెచ్చరించింది. కాగా ఈయూలో యాంటీట్రస్ట్‌ కేసులో అతిపెద్ద జరిమానాను ఎదుర్కొన్న కంపెనీగా గూగుల్‌ నిలిచింది. 2009లో అమెరికా చిప్‌ మేకర్‌ ఇంటెల్‌కు 1.06 బిలియన్‌ యూరోల జరిమానా విధించింది. 
views: 980

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams