Current Affairs Telugu Daily

అంగన్వాడీ కేంద్రాలకు రామ్‌ఇన్ఫో ‘మార్స్‌’ ప్రాజెక్టు.  
ఇ-గవర్నెన్స్‌ ప్రాజెక్టులు అధికంగా చేపట్టే హైదరాబాద్‌కు చెందిన సంస్థ రామ్‌ఇన్ఫో లిమిటెడ్‌ పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని పసిగట్టేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ‘మార్స్‌’ ప్రాజెక్టు అనే పేరుతో దీన్ని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద దీన్ని అమలు చేస్తున్నట్లు, త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని 5 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో అమల్లోకి తీసుకురాబోతున్నామని రామ్‌ఇన్ఫో ఎండీ ఎల్‌.శ్రీనాధ్‌రెడ్డి చెప్పారు. ‘ఫేసియల్‌ రికగ్నిషన్‌’ టెక్నాలజీ ఆధారంగా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని పిల్లల శారీరక, ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు విశ్లేషించటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా చెప్పారు. 
views: 852

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams