Current Affairs Telugu Daily

25 ఏళ్లు నిండిన విద్యార్థులూ నీట్‌ రాయొచ్చు : సుప్రీంకోర్టు 
వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ ప్రవేశ పరీక్షకు వయోపరిమితిని సుప్రీంకోర్టు సడలించింది.
  • 2019 సంవత్సరానికిగాను ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)ను 25 ఏళ్లు నిండిన విద్యార్థులూ రాయవచ్చని 2018 నవంబర్‌ 29న ఆదేశాలు జారీ చేసింది.
  • తుది ప్రవేశాలు కేసు తీర్పుపై ఆధారపడి జరుగుతాయని పేర్కొంది. నీట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సాధారణ కేటగిరీ విద్యార్థులకు గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లుకాగా, రిజర్వేషన్‌ విద్యార్థులకు 30 ఏళ్లుగా పేర్కొంది.
  • గరిష్ఠ వయోపరిమితిని కొనసాగించాన్న భారత వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయం నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వు వెలువడింది.

views: 698

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams