Current Affairs Telugu Daily

పీఎస్‌ఎల్‌వీ-సీ43 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2018 నవంబర్‌ 29న శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ43 విజయవంతంగా ప్రయోగించింది.
  • పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ ద్వారా 31 ఉపగ్రహాలను ముందుగా నిర్ణయించిన మేరకు కక్ష్యలో ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ-సీ43 వాహకనౌక 380 కిలో బరువున్న మన దేశ ఉపగ్రహంతోపాటు ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలను మోసుకెళ్లింది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ బయలుదేరాక 17.27 నిమిషాలకు మనదేశానికి చెందిన హైపవర్‌ స్ప్రెక్టల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహాన్ని 636 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో వదిలిపెట్టింది.
  • రాకెట్‌లోని పీఎస్‌4 ఇంజిన్‌ను మరోమారు మండించి విదేశాలకు చెందిన ఉపగ్రహాలను 504 కిలోమీటర్ల ఎత్తులో ఒక్కొక్కటిగా కక్ష్యలో విడిచిపెట్టింది. మన ఉపగ్రహం వదిలపెట్టాక మిగిలినవి కక్ష్యలో చేర్చడానికి 95 నిమిషాల సమయం పట్టింది. మొత్తంగా 112 నిమిషాల సమయం తీసుకుంది. ఇస్రో  గతంలో కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టింది.
  • 2016 సెప్టెంబరు 25న షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను తీసుకెళ్లారు. అప్పట్లోనూ ఒకే రాకెట్‌ ద్వారా వేర్వేరు కక్ష్యలో ఉపగ్రహాలను విడిచిపెట్టారు. ఆ సమయంలోనూ పీఎస్‌4 ఇంజిన్‌ను రెండుసార్లు మండించారు.
  • హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం(హెచ్‌వైఎస్‌ఐఎస్‌)లో ఆప్టికల్‌ ఇమేజింగ్‌ డిటెక్టర్‌ ఆరె చిప్‌ ఉంటుంది. దీనిని ఇస్రో ప్రధాన విభాగమైన అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ వారు రూపకల్పన చేశారు. దాని అనుబంధ సంస్థ ఉన్న చండీగఢ్‌లోని సెమికండక్టర్‌ లేబొరేటరీ వారు తయారుచేశారు.
  • పీఎస్‌ఎల్‌వీ ద్వారా కొత్తగా 4 దేశాల వారు తమ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. కొలంబియాకు చెందిన ఎఫ్‌ఏసీ శాట్‌, మలేసియా ఇన్నోశాట్‌-2, స్పెయిన్‌ త్రీక్యాట్‌-1, ఆస్ట్రేలియాకు చెందిన సెంచరీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు.
ఇస్రో ఛైర్మన్‌ - డాక్టర్‌ శివన్‌ 

views: 756



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams