Current Affairs Telugu Daily

ఆంధ్రపత్రిక ఎడిటర్‌ పాంచజన్య మృతి
సీనియర్‌ జర్నలిస్టు, ఆంధ్రపత్రిక ఎడిటర్‌ పాంచజన్య (62) 2018 నవంబర్‌ 28న విజయవాడలో మృతి చెందారు.
పాంచజన్య 1957 ఆగస్టు 10న కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామంలో రేపల్లి కృష్ణమూర్తి, పుష్పవతి దంపతులకు ఆరో సంతానంగా జన్మించారు.
20వ ఏట ఈనాడు అవనిగడ్డ విలేకరిగా పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 1984 వరకు కమెండో, ఆంధ్రభూమి మాసపత్రికు, ఉదయం, తార, సితార పత్రికకు ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా పనిచేశారు.
1984 నుంచి 1991 వరకు స్టార్‌ పాలిటిక్స్‌, టుడే పాలిటిక్స్‌ పక్షపత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. 1992 నుంచి కొంతకాలం హైదరాబాద్‌లో ‘మహానగర్‌’ పత్రికను నిర్వహించారు. 2017 జులైలో ఆంధ్రపత్రికను విజయవాడ కేంద్రంగా పునఃప్రారంభించారు. ప్రస్తుతం ఆ పత్రికలకు ఆయన ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

views: 852



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams