Current Affairs Telugu Daily

తిరుపతిలో మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థ
తిరుపతిలో 200 ఎకరాల్లో రూ.188కోట్ల పెట్టుబడితో వైద్యపరమైన ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థల అభివృద్ధికి అనువుగా మేజెస్‌ ఎక్ట్రానిక్స్‌ పార్కు సంస్థ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖతో ఒప్పందం చేసుకుంది.
  • 2018 నవంబర్‌ 28న మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖ కార్యదర్శి విజయానంద్‌తో మేజెస్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఎండీ ఇందుమౌళి ఒప్పందం చేసుకున్నారు.
  • మెడిక్యూట్‌ హెల్త్‌కేర్‌, సిద్దార్థ ఇన్‌ఫ్రాటెక్‌ సర్వీసెస్‌, ఆల్‌ బారాక ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్‌ కన్సార్టియంగా మేజెస్‌ ఎలక్ట్రానిక్స్‌ పెట్టుబడు పెట్టనుంది. మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌లో 50 పేటెంట్లు సాధించడమే లక్ష్యంగా గ్రీన్‌ఫీల్డ్‌ మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టరును అభివృద్ధి చేయనున్నారు. 

views: 864



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams