Current Affairs Telugu Daily

విదేశీ పీహెచ్‌డీ పట్టాదారులకు నేరుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు :UGC
విదేశీ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టాలు పొందినవారిని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నేరుగా అనుమతిస్తామని విశ్వవిద్యాలయ నిధుల సంఘం (UGC) వెల్లడించింది.
  • ప్రస్తుతం భారత వర్సిటీలు, విద్యా సంస్థల్లో ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. సంబంధిత విభాగంలో 55 శాతం మార్కుతో భారత వర్సిటీ లేదా భారత్‌ గుర్తింపు పొందిన విదేశీ వర్సిటీ నుంచి మాస్టర్‌ డిగ్రీ తప్పనిసరి.
  • అంతేకాదు జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) లేదా సెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ నిబంధనను యూజీసీ సడలించింది. ఇకపై మాస్టర్‌ డిగ్రీలో కనీస మార్కు సాధించి, పీహెచ్‌డీ పట్టాఉన్న దేశీయ అభ్యర్థులు ఎవరైనా నేరుగా పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • విదేశీ పీహెచ్‌డీ పట్టాదారులకు కనీస మార్కు నిబంధన ఎత్తివేశారు. ఆర్ట్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌, ఎడ్యుకేషన్‌, లా, సోషల్‌ సైన్సెస్‌, సైన్సెస్‌, లాంగ్వేజీ, లైబ్రరీ సైన్సెస్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాల్లోని నియామకాలకు తాజా మార్పులు వర్తిస్తాయి.
UGC-University Grants Commission

views: 749Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams