Current Affairs Telugu Daily

మరణ శిక్ష రాజ్యాంగబద్ధమే : సుప్రీంకోర్టు 
మరణ శిక్ష రాజ్యాంగ బద్ధమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2ః1 మెజారిటీతో 2018 నవంబర్‌ 28న మరణశిక్షను సమర్థించింది.
  • ధర్మాసనంలోని సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ మాత్రం దీనితో విభేదించారు. సమాజంలో నేరాల్ని నిరోధించేందుకు మరణ శిక్ష తోడ్పడుతుందని చెప్పలేమని న్యాయకమిషన్‌ 262వ నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు.
  • మిగతా ఇద్దరు న్యాయమూర్తు ఆయన అభిప్రాయంతో విభేదించారు.లు మరణ శిక్ష సరైనదేనని, ఈ విషయంలో చర్చ అక్కర్లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని వివరించారు.
  • హత్య కేసులో ఛన్నూలాల్‌ వర్మ అనే వ్యక్తికి పడిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చే విషయమై తీర్పు వెలువరించేటప్పుడు సుప్రీంకోర్టులో ఇలా భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి.
  • 2011లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని హత్య చేసిన ఛన్నూలాల్‌ వర్మ అనే దోషికి మరణ శిక్ష పడింది. ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చడాన్ని ముగ్గురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

views: 701

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams