Current Affairs Telugu Daily

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చివరి పదం ‘జిజ్జీవా’
ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే ఆకుపచ్చగా ఉండే గొల్లభామ తరహా మిడత ‘జిజ్జీవా’(ఆంగ్ల అక్షరాల్లో...ZYZZYVA) ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీలో ఇప్పుడు సరికొత్త చివరిపదంగా చేరింది. ఇప్పటి దాకా ‘జిథమ్‌’ అనే పదమే చివరిదిగా కొనసాగింది. జిథమ్‌ అనేది ఓ రకమైన మాల్ట్‌ బీరు. గొల్లభామ తరహా మిడతకు ‘జిజ్జీవా’ అనే ఎందుకు నామకరణం చేశారనడానికి ప్రస్తుతానికి స్పష్టమైన సమాచారం అంటూ ఏమీ లేదని అమెరికా డిక్షనరీ రూపకల్పన వ్యవహారాలు చూసే క్యాథరీన్‌ కానర్‌ మార్టిన్‌ తెలిపారు. బహుశా అది చేసే ఓ విధమైన చప్పుడు దానికి ఆ పేరు పెట్టడానికి కారణమై ఉండవచ్చన్నది కొందరి అభిప్రాయంగా ఉంది. డిక్షనరీలోకి తాజాగా చేర్చిన అనేక పదాల్లో చిక్‌ పీ(ఇంగ్లీష్‌), స్ల్పిట్‌ చిక్‌పీ(ఇంగ్లీష్‌) ఉన్నాయి. వీటిని తెలుగులో శనగలు, శనగపప్పుగా వ్యవహరిస్తాం. సరికొత్త పదాలను చేర్చి సంకలనం చేసిన ఇంగ్లీష్‌ డిక్షనరీని 2017 జూన్‌ 27న ఆవిష్కరించారు.
views: 1203

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams