Current Affairs Telugu Daily

ఐసీఎస్‌ విశ్రాంత అధికారి వీకే రావు మృతి 
విశ్రాంత ఐసీఎస్‌ అధికారి వల్లూరి కామేశ్వరరావు (104) 2018 నవంబర్ 27న హైదరాబాద్‌లో కన్నుమూశారు. వి.కామేశ్వర్‌రావు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు ఐఏఎస్‌ అధికారులు, మాజీ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
  • ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. వీకే రావు అత్యున్నత విలువలను చాటి సివిల్‌ సర్వీసు అధికారులకు ఆదర్శంగా నిలిచారని కేసీఆర్‌ పేర్కొన్నారు. వీకే రావు బ్రిటిష్‌ కాలంలో 1937లో ఐసీఎస్‌ అధికారిగా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుత ఐఏఎస్‌ అధికారులకు మార్గదర్శిగా ప్రేరణగా నిలిచారు. ఏపీ చీఫ్‌ సెక్రటరీగా, ఏపీలో రాష్ట్రపతి పాలన కొనసాగినప్పుడు గవర్నర్‌కు సలహాదారుగా పనిచేశారు.
  • దేశ విభజన సందర్భంగా జరిగిన అల్లర సమయంలో, పలు విపత్కర సమయాల్లో వీకే రావు చాకచక్యంగా విధులు నిర్వర్తించి పేరు తెచ్చుకున్నారు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేశారు.
  • ఏపీ విజిలెన్స్‌ కమిషనర్‌గా సేవలందించారు. 

views: 771

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams