Current Affairs Telugu Daily

లోధా సంస్కరణలపై BCCI కమిటీ
లోధా ప్యానెల్‌ సూచించిన సంస్కరణ అమలుపై BCCI 2017 జూన్‌ 27న ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా నేతృత్వంలోని ఈ కమిటీలో మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ, బోర్డు కోశాధికారి అనిరుధ్‌ చౌదరి, కార్యదర్శి అమితాబ్‌ చౌదరి ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పులో అమలుకు అత్యంత కష్టంగా ఉన్న అంశాలను గుర్తించడం ఈ కమిటీ బాధ్యత. లోధా కమిటీ సంస్కరణలను పూర్తిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. 
BCCI-Board of Control for Cricket in India
IPL-Indian Premier League

views: 943

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams