Current Affairs Telugu Daily

ప్రపంచ జ మండలి బోర్డు గవర్నర్‌ పదవికి వి.ప్రకాశ్‌ పోటీ
ప్రపంచ జ మండలి(WWC) బోర్డు గవర్నర్ల నియామకానికి 2018 నవంబర్‌ 30న ఫ్రాన్స్‌లో జరగనున్న ఎన్నికల్లో భారత ప్రభుత్వం తరఫున గవర్నర్‌ ఆల్డర్‌నేట్‌గా పోటీ చేసే అవకాశం తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌కు దక్కింది.
  • ఈ మండలిలో ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంకు, పలు అంతర్జాతీయ సంస్థలతోపాటు 151 దేశాలకు సభ్యత్వం ఉంది. 3 సం॥లకు ఒకసారి ఈ మండలి వరల్డ్‌ వాటర్‌ ఫోరం సమావేశాలను వివిధ దేశాల్లో నిర్వహిస్తుంది.
  • 2018 మేలో ప్రకాశ్‌ నేతృత్వంలో కృష్ణానది పునరుజ్జీవంపై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈక్రమంలో భారత జల మండలి, సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇరిగేషన్‌, పవర్‌ సంస్థలు భారత్‌ తరఫున డబ్ల్యూడబ్ల్యూసీకి ఆయనను నామినేట్‌ చేశాయి. 
WWC-World Water Council

views: 975

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams