Current Affairs Telugu Daily

సాంకేతికతతో నీటిమట్టా మదింపు: IMD
వర్షాల వల్ల నదులు, ఇతర జలాశయాల్లో నీటి మట్టాల పెరుగుదల తీరును మరింత కచ్చితత్వంతో అంచనా వేసే సాంకేతికతను భారత వాతావరణ విభాగం(IMD) అభివృద్ధి చేసింది.
  • ఇటీవల కేరళను వర్షాలు అనూహ్యంగా ముంచెత్తిన అనుభవం నేపథ్యంలో ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వర్షపాతం ప్రభావాన్ని రాష్ట్రాలు ఇంకా సూక్ష్మంగా మదించి, తక్షణం తగిన చర్యల్ని చేపట్టేందుకు ఇది దోహదపడుతుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ కె.జె.రమేశ్‌ వెల్లడించారు.
  • ‘ఒక జలాశయం నుంచి నీళ్లను విడిచిపెట్టాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవడంలో నీటిమట్టం గణాంకాలు కీలకం. రాష్ట్రాలు తగిన నిర్ణయాలు తీసుకునేందుకు నూతన సాంకేతికత దోహదం చేస్తుంది.
  • దీని సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కేరళలో భారీస్థాయి వరదలకు కారణం వాతావరణ మార్పులే. గతంలో ఏటా 10 తుపాన్లు వచ్చేవి.
  • ఇప్పుడు అవి 18కి పెరిగాయి. తుపాను తీవ్రతకు మహా సముద్రాల్లో ఉపరితల జలాల వేడిమికి సంబంధం ఉంది. దానిని గుర్తించడంలో సహాయపడేందుకూ మరో సాంకేతికత ఉంది’ అని చెప్పారు. 
IMD-India Meteorological Department

views: 795

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams