Current Affairs Telugu Daily

ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌ 
 ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌ లభించింది. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ అగ్రానమీ (ఏఎస్‌ఏ) ఏటా అందించే ఫెలోఫిష్‌లో భాగంగా 2018కి జెనెటిక్స్‌ గెయిన్స్‌ విభాగంలో సంచాలకుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ రాజీవ్‌ కె.వర్షణేను ఎంపిక చేసింది.
  • ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 మందికి ఫెలోషిఫ్‌ను అందిస్తుండగా అందులో ముగ్గురు మినహా అంతా అమెరికన్లే. భారత్‌ నుంచి ఈ జాబితాలో రాజీవ్‌ ఒక్కరే చోటు దక్కించుకున్నారని 2018 నవంబర్ 22న విడుదల చేసిన ప్రకటనలో ఇక్రిశాట్‌ వర్గాలు పేర్కొన్నాయి.
  • పంటల అభివృద్ధిలో భాగంగా ఆయన జీనోమిక్స్‌, మాలిక్యులార్‌ బ్రీడింగ్‌ అంశాలపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.

views: 862

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams