Current Affairs Telugu Daily

ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడిగా కిమ్‌ జోంగ్‌ యాంగ్‌
అంతర్జాతీయ పోలీసు సంస్థ-ఇంటర్‌పోల్‌ నూతన అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ జోంగ్‌ యాంగ్‌(57) ఎన్నికయ్యారు. యూఏఈలోని దుబాయ్‌లో 2018 నవంబర్‌ 21న జరిగిన వార్షిక సమావేశంలో కిమ్‌ జాంగ్‌ యాంగ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఇంటర్‌పోల్‌ వెల్లడించింది.
  • ఆయన ఈ పదవిలో యాంగ్‌ 2020 వరకూ కొనసాగుతారు. ఇప్పటివరకూ ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడిగా ఉన్న చైనా మాజీ మంత్రి మెంగ్‌ హాంగ్వే 2019 సెప్టెంబర్‌లో అదృశ్యం కావడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
  • చైనా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా లంచం ఆరోపణపై బీజింగ్‌లో విమానం దిగగానే  ఆ దేశ అధికారులు మెంగ్‌ హాంగ్వేను అదుపులోకి తీసుకున్నారు.  
  • ఈ ఎన్నికల సందర్భంగా రష్యా అభ్యర్థి, ఇంటర్‌పోల్‌ ఉపాధ్యక్షుడు అలెగ్జాండర్‌ ప్రోకోప్‌చుక్‌ అభ్యర్థిత్వాన్ని అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలు వ్యతిరేకించాయి.

views: 973

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams