Current Affairs Telugu Daily

సిక్కుల ఊచకోత కేసులో దోషికి మరణ శిక్ష 
ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో చెరేగిన సిక్కుల ఊచకోత కేసులో దోషి యశ్‌పాల్‌సింగ్‌కు డిల్లీ కోర్టు మరణ శిక్ష విధించింది.
  • సహదోషి నరేశ్‌ షెరావత్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వీరిద్దరికీ రూ.35 లక్షల చొప్పున జరిమానా సైతం విధిస్తూ, ఆ మొత్తాన్ని మృతులు కుటుంబ సభ్యులకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
  • సిక్కుల వ్యతిరేక అల్లర్లలో భాగంగా హరదేవ్‌సింగ్‌, అవతార్‌సింగ్‌ అనే వ్యక్తుల్ని దహనం చేసిన ఘటనలో రవాణా వ్యాపారి యశ్‌పాల్‌సింగ్‌కు మరణశిక్ష విధిస్తున్నట్లు అదనపు సెషన్స్‌ జడ్జి అజయ్‌ పాండే 2018 నవంబర్‌ 20న తెలిపారు.
  • నరేశ్‌ షెరావత్‌కు కూడా ఇదే సెక్షన్‌ కింద యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా తీర్పును తీహార్‌ జైలులో వెలువరించారు.
  • సిక్కుల వ్యతిరేక అల్లర్ల కేసులో సరైన ఆధారాలు లేవంటూ డిల్లీ పోలీసు 1994లో కేసును మూసివేయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కేసును చేపట్టింది.
  • 1984 నవంబర్‌ 1న దక్షిణ డిల్లీ మహిపాల్‌పూర్‌ ప్రాంతంలో యశ్‌పాల్‌, నరేశ్‌ నేతృత్వంలో సుమారు 500 మందితో కూడిన గుంపు హరదేవ్‌సింగ్‌, అవతార్‌సింగ్‌ ఇళ్లను చుట్టుముట్టి వారిని హతమార్చినట్లు తేల్చింది. ఈ క్రమంలో నవంబర్‌ 14న యశ్‌పాల్‌, షెరావత్‌ను కోర్టు దోషులుగా గుర్తించింది.
  • 2015లో సిట్‌ కేసును తిరిగి తెరిచిన తర్వాత వెలువడిన తొలి తీర్పు ఇదే. సిట్‌ ఏర్పడిన తర్వాత తొలి మరణశిక్ష కూడా ఇదే. 1984 అక్టోబర్‌ 31న సిక్కుల అంగరక్షకుల కాల్పుల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ మరణించిన అనంతరం మూడు రోజులపాటు చెలరేగిన అల్లర్లలో దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది సిక్కులు మరణించగా, డిల్లీలోనే 2,100 మంది హత్యకు గురయ్యారు.
ఈ కేసులో ఘటన క్రమం..
1984 నవంబర్‌ 1: సిక్కుల వ్యతిరేక అల్లర్ల సమయంలో సుమారు 300 మందితో కూడిన గుంపు దక్షిణ డిల్లీలోని మహిపాల్‌పూర్‌లో హర్‌దేవ్‌ సింగ్‌, అవ్‌తార్‌ సింగ్‌ అనే వారిని కొట్టి చంపింది.
1985 ఫిబ్రవరి 23: ఈ ఘటనకు సంబంధించి జైపాల్‌ సింగ్‌ అనే వ్యక్తిపై చార్జిషీట్‌ దాఖలైంది.
1985 మే: ఈ దాడులపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ ఏర్పాటయింది.
1985 సెప్టెంబర్‌ 9:  దీనిపై డిల్లీ పోలీసుల అల్లర్ల వ్యతిరేక విభాగం దర్యాప్తు చేపట్టింది.
1986 డిసెంబర్‌ 20: జైపాల్‌ సింగ్‌ను నిర్దోషిగా పేర్కొంది. 1994 ఫిబ్రవరి 9:  హర్‌దేవ్‌ సింగ్‌ మ ృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయారు. అనుమానితులెవరినీ ప్రశ్నించకుండానే కేసు మూసివేశారు. 2015 ఫిబ్రవరి: అల్లర్లపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. 2016 ఆగస్టు: సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఆధారాలుంటే తెలియజేయాని ప్రజలను కోరుతూ పంజాబ్‌, డిల్లీల్లోని ప్రముఖ వార్తా పత్రికల్లో సిట్‌ ప్రకటను ఇచ్చింది.
2017 జనవరి 31: హర్‌దేవ్‌ సింగ్‌, అవ్‌తార్‌సింగ్‌ హత్యా సంఘటనకు సంబంధించి 18 మంది సాక్షులను విచారించిన సిట్‌.. నరేశ్‌ షెరావత్‌, యశ్‌పాల్‌ సింగ్‌ అనే వారిని దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో చార్జిషీటు వేసింది.
2018 నవంబర్‌ 14: ఆ ఇద్దరూ దోషులేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
2018 నవంబర్‌ 15: ఈ కేసులో తీర్పును నిలుపుదల చేసింది. పాటియాలా కోర్టు ఆవరణలోనే దోషుపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు.
2018 నవంబర్‌ 20: యశ్‌పాల్‌కు మరణశిక్ష, షెరావత్‌కు జీవితకా జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 

views: 885

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams