Current Affairs Telugu Daily

‘భూధార్‌’ పథకం ప్రారంభం 
భూ వివాదాల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూధార్‌’ పథకాన్ని 2018 నవంబర్‌ 20న ఉండవల్లి నివాసంలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. 
  • భూధార్‌ కార్డును రాష్ట్రవ్యాప్తంగా 2018 నవంబర్‌ 21 నుంచి పొందే అవకాశాన్ని రెవెన్యూ శాఖ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని 17,484 గ్రామాల్లోని వ్యవసాయ భూముల వివరాలు భూసేవ పోర్టల్‌ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. 
  • ప్రతి భూభాగం, స్థిరాస్తికి ‘భూధార్‌’ విశిష్ట సంఖ్య (11 అంకెతో) రాష్ట్ర వ్యాప్తంగా అందజేయనున్నారు. వేలిముద్రలు, కనుపాప ఆధారంగా మనుషులకు ఆధార్‌ ఇచ్చినట్లే.. భూములు, ఆస్తుల గుర్తింపునకు సర్వేనెంబర్లు, సబ్‌డివిజన్ల ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో భూధార్‌ ఇవ్వనున్నారు.
  • రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 0.32 కోట్ల పట్టణ ఆస్తులు, 0.84 కోట్ల గ్రామీణ ఆస్తులకు భూధార్‌ కేటాయిస్తున్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌, పంచాయతీ, పురపాలక, అటవీ శాఖలు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకుంటాయి.
  • ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 2018 ఏప్రిల్‌ 11న ప్రారంభించారు. సుమారు 20 భూసంబంధిత సేవలు -భూ సమాచారం, ఈ-కేవైబీ, మ్యుటేషన్‌-ఎస్‌-ఎ-సర్వీస్‌, భూమార్పిడి, ఇతర సేవలు 2018 నవంబర్ 20 నుంచి అందుబాటులోకి వచ్చాయి.  
  • భూధార్‌వల్ల భూమికి భద్రత, మోసపూరిత లావాదేవీల నియంత్రణ, కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ద్వారా సేవలు పొందటం, భూకమతాలు- స్థిరాస్తులను ఆధునిక సాంకేతిక విధానంలో గుర్తించడం సులువవుతుంది.
  • కాగితరహితంగా లావాదేవీలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సంఖ్యను కేటాయించడం వల్ల భూమి సొంతదారులతో సహా విస్తీర్ణం, పూర్వచరిత్ర, ఇతర వివరాలు తెలుసుకోడానికి వీలుంటుంది.
  • భూయజమాని మారినప్పుడు అప్పటివరకు ఉన్న భూధార్‌ సంఖ్యను రద్దు చేసి, ఆధార్‌ వివరాలతో కొత్త సంఖ్యను కేటాయిస్తారు. భూమి సమాచారాన్ని యజమాని అంగీకరించాకే భూధార్‌ ప్రామాణీకరిస్తారు. ఉపగ్రహ చిత్రాలను ఎఫ్‌ఎంబీతో అనుసంధానిస్తారు. క్షేత్రస్థాయి వివరాలతో పోల్చి చూస్తారు.
  • రెవెన్యూ కార్యాలయ వివరాలతో సరిపోల్చడంతోపాటు అనుభవదారులను గుర్తించాకే భూధార్‌ కేటాయిస్తారు. భూదస్త్రాల్లోని సమాచారాన్ని భూమిపై వాస్తవ పరిస్థితి (చిత్రా ఆధారంగా)కి అనుసంధానిస్తారు. మీసేవా కేంద్రా ద్వారా సేవలు పొందవచ్చు. భూసేవ పోర్టల్‌ ద్వారా నేరుగా నమోదు చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

views: 941

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams