Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే తొలి పూర్తి మానవ శరీర త్రీడీ ప్రతిబింబాలను సెకన్లలో అందించే స్కానర్‌ ‘ఎక్స్‌ప్లోరర్‌’
పూర్తి మానవ శరీర త్రిమితీయ(త్రీడీ) ప్రతిబింబాలను కేవలం 20-30 సెకన్లలో అందించగల స్కానర్‌ను ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
  • దీనికి ‘ఎక్స్‌ప్లోరర్‌’గా నామకరణం చేశారు. పాసిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ(పీఈటీ), ఎక్స్‌రే కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ(సీటీ) స్కానర్‌ సాంకేతికతల మేలుకలయికతో ఇది పనిచేస్తుంది.
  • ప్రస్తుత పీఈటీ స్కాన్లతో పోలిస్తే 40 రెట్లు ఎక్కువ వేగంతో ‘ఎక్స్‌ప్లోరర్‌’ స్కానింగ్‌ ప్రక్రియను పూర్తిచేస్తుంది. మొత్తం శరీరాన్ని ఏకకాలంలో స్కాన్‌ చేస్తుంది. కేవలం 20-30 సెకన్లలో పూర్తి శరీర ప్రతిబింబాన్ని అధిక నాణ్యతతో అందిస్తుంది.
  • ప్రస్తుత పీఈటీ స్కానర్లతో పోలిస్తే నూతన స్కానర్‌ 40 రెట్లు తక్కువగా రేడియోధార్మికతను ఉపయోగించుకుంటుంది. వ్యాధి నిర్ధారణ రంగాన్ని మెరుగుపర్చడం, నూతన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడం సహా లెక్కలేనన్ని అంశాల్లో ‘ఎక్స్‌ప్లోరర్‌’ మానవాళికి దోహదపడే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

views: 688

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams