Current Affairs Telugu Daily

శ్రీలంక పార్లమెంట్‌ నిర్వహణకు సెలెక్ట్‌ కమిటీ
పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను శ్రీలంక రాజకీయ పార్టీలు అంగీకరించాయి.
  • 2018 అక్టోబర్‌ 26న ప్రధాని విక్రమసింఘేను తొలగిస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.
  • సుప్రీంకోర్టు జోక్యంతో పార్లమెంట్‌లో బలపరీక్ష జరపగా..కొత్త ప్రధాని రాజపక్స అందులో ఓడిపోయారు. ఈ పరిణామం అనంతరం పార్లమెంట్‌ కార్యకలాపాలు గందరగోళం మధ్య సాగుతున్నాయి.
  • సభా కార్యకలాపాలు సవ్యంగా సాగేలా చూసేందుకు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలన్న అధ్యక్షుడి ప్రతిపాదనకు 2018 నవంబర్‌ 19న అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. 

views: 695

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams