Current Affairs Telugu Daily

ఆధార్‌తో ఖాతా ప్రారంభం నిలిపివేత : SBI
ఆధార్‌ వినియోగించుకుని, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా బ్యాంకు ఖాతా తెరిచే విధానాన్ని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిలిపివేసింది.
  • బ్యాంకింగ్‌ సేవలు పొందేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.  అన్ని రకాల సేవలు లభించేలా, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనోను ఎస్‌బీఐ 2017 నవంబరులో విడుదల చేసింది.
  • ఆర్థిక సేవలు, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు, బ్యాంకింగ్‌ సేవలు, బ్యాంకు శాఖకు వెళ్లకుండానే ఖాతా తెరిచే సౌలభ్యం వంటివి దీని ప్రత్యేకతలు. ఇకపై ఖాతాదారులు కొత్త ఖాతా కోసం బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది.
SBI-State Bank of India
SBI చైర్‌పర్సన్‌ - రజనీష్‌కుమార్‌
SBI ప్రధాన కార్యాలయలం - ముంబై
SBI ఏర్పాటు - 1955 జులై 1

views: 749

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams