Current Affairs Telugu Daily

20 శాతం జిల్లాల్లో వ్యవసాయరంగంపై వాతావరణ మార్పు ప్రభావం
జనాభాలో సగం మంది ఆధారపడిన భారత వ్యవసాయ రంగానికి వాతావరణం పెద్ద గండంగా మారింది.
  • దేశంలో 20 శాతం జిల్లాల్లో వ్యవసాయ రంగంపై వాతావరణ మార్పు ప్రభావం తీవ్రంగా ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.
  • తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితుల కారణంగా ముప్పు అంతకంతకూ పెరిగిపోతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ICAR) అధ్యయనంలో వెల్లడైంది.
  • దేశంలోని 151 జిల్లాల్లో పంటలు, తోటలు, పశుసంపద వాతావరణ మార్పు ప్రభావానికి లోనవుతున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలపైనా ఇది ప్రభావం చూపుతోందని తెలిపింది.
దుష్ఫలితాలు 
  • హిమాచల్‌ప్రదేశ్‌లోని యాపిల్‌ తోటలు మరింత ఎత్తయిన పర్వత ప్రాంతాలకు తరలివెళ్లాయి. తగిన శీతల వాతావరణం కోసం ఈ పరిణామం చోటుచేసుకుంది. 
  • మధ్య భారతంలో వడగళ్ల వానలు, 2010లో పంజాబ్‌లో ఉష్ణోగ్రతలు  ఆకస్మికంగా పెరిగిపోవడం వంటి పరిణామాలతో ఆ ఏడాది గోధుమల దిగుబడి 26 శాతం పడిపోయినట్లు లూధియానాకు చెందిన బోర్లాగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తేల్చింది. 
  • గోధుమ పండే 2.8 కోట్ల హెక్టార్లలో 90 లక్షల హెక్టార్లు ఆకస్మిక ఉష్ణోగ్రత ఒత్తిడి ముప్పును ఎదుర్కొంటున్నాయి. 
  • మారుతున్న వాతావరణ పరిస్థితులు, వర్షపాతం కారణంగా ఝార్ఖండ్‌ సాహిబ్‌గంజ్‌ జిల్లాలోని వరి పండించే మాల్టోస్‌ గిరిజనలు కొత్త తెగుళ్లతో సతమతమవుతున్నట్లు 2016లో చేపట్టిన ఓ అధ్యయనంలో గుర్తించారు. ఈ సమస్యతో మాల్టోస్‌ గిరిజనులు.. సంతాల్‌ గిరిజనుల ఆధిపత్యం ఉండే ప్రాంతాలకు తరలి వెళ్లడంవల్ల ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. 
  • దేశంలో మామిడి పండే 10 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల ఫ్రూట్‌ఫ్లైస్‌ బెడద అధికమైంది. 
  • వాతావరణ మార్పు వల్ల దేశంలో వార్షిక వ్యవసాయ ఆదాయం 15-18 శాతానికి తగ్గిపోతుందని, నీటిపారుదల లేని ప్రాంతాల్లో సగటున 20-25 శాతం తగ్గుతుందని జాతీయ ఆర్థిక సర్వే-2018 విశ్లేషించింది. 
  • దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు ఇవే ఆధారాలని భారత వాతావరణ మార్పు అగ్రశ్రేణి శాస్త్రవేత్త ప్రమోద్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.
ఏం చేస్తారు.. 
  • వాతావరణ మార్పుకు సంసిద్ధతపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతమున్న అన్ని పథకాలనూ కలిపి కొత్త పథకాన్ని సిద్ధం చేయాల్సిందిగా కేంద్రమంత్రి ఐసీఏఆర్‌ను ఆదేశించారు. వాతావరణ అనుగుణ సమగ్ర వ్యవసాయ కార్యక్రమంగా ఈ పథకాన్ని ప్రతిపాదించారు. 
  • వాతావరణ ప్రభావానికి లోనైన 151 జిల్లాల్లో ఒక గ్రామాన్ని ఎంచుకుని.. అక్కడ భౌగోళిక నిర్దిష్ట సాంకేతికతను మోహరించనున్నారు. 
  • గుజరాత్‌ ఆనంద్‌ జిల్లాలోని ఆవా రైతులను విత్తులేసే సమయాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు. పురుగు దాడుల పెరుగుతుండటంతో వాటిని తప్పించుకునేందుకు ఈ మార్పును సూచించారు.
ICAR-Indian Council of Agricultural Research

views: 730

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams