Current Affairs Telugu Daily

స్వచ్ఛభారత్‌కు WHO ప్రశంస 
భారత్‌లో చేపట్టిన స్వచ్ఛ భారత్‌ ఉద్యమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రశంసలు లభించాయి.
  • ప్రజల్లో ప్రతి ఒక్కరికీ సురక్షితమైన పారిశుధ్య సేవలను దేశాలు ఎలా అందుబాటులోకి తేవచ్చనడానికి స్వచ్ఛభారత్‌ చక్కని ఉదాహరణ అని డబ్ల్యూహెచ్‌వో 2018 నవంబర్‌ 18న పేర్కొంది.
  • స్వచ్ఛభారత్‌ కార్యక్రమంతో ప్రతి ఇంటా పరిశుభ్రత పరిఢవిల్లిందని 2016-18 మధ్యకాలంలో ఏటా ఈ దిశగా 13 శాతం పెరుగుదల కనిపించిందని వెల్లడించింది. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, చక్కని మురుగునీటి పారుదల వసతి అనేది ప్రతిఒక్కరికీ అందుబాటులోకి రావాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 
WHO-World Health Organization
WHO ప్రధాన కార్యాలయలం- జెనీవా, స్విట్జర్లాండ్‌
WHO అధిపతి- టెడ్రోస్‌ అధనోమ్‌
WHO ఏర్పాటు - 1948 ఏప్రిల్‌ 7

views: 757



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams