Current Affairs Telugu Daily

మాల్దీవుల నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడి
మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్ 2018 నవంబర్‌ 17న ప్రమాణ స్వీకారం చేశారు.
  • మాలెలోని జాతీయ స్టేడియంలో జరిగిన సోలిహ్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రధాని నరేంద్రమోడి హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఈ ఎన్నికలతో రెండు దేశాల మధ్య సహకార, మైత్రి బంధాన్ని పునరుత్తేజింపచేయడానికి మార్గం సులుగమమవుతుందని ఇద్దరు నేతలు పేర్కొన్నారు.
  • హిందూ మహాసముద్రంలో శాంతి, భద్రతను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందని వారు ఏకీభవించారు. ప్రధాని హోదాలో మోడి మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2018 సెప్టెబర్‌ 23న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండీపీ)కి చెందిన సోలిహ్ ఓడించాడు.
  • యమీన్‌.. చైనాకు సన్నిహితుడన్న పేరు ఉంది. ఆయన హయంలో భారత్‌-మాల్దీవుల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.

views: 888

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams