Current Affairs Telugu Daily

విశాఖపట్నంలో ఎం.ఎస్‌.ధోని క్రికెట్‌ అకాడమీ 
విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎం.ఎస్‌.ధోని క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు.
  • ఈ మేరకు ఎం.ఎస్‌.ధోనికి చెందిన ఆర్కా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి(ఏపీఈడీబీ) ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
  • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో విశాఖలో ఈ ఒప్పందం కుదిరింది.
  • ఇందులో భాగంగా ఆర్కా స్పోర్ట్స్‌ సంస్థ రూ.60 కోట్లతో రెండు దశల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్‌ అకాడమీని, అంతర్జాతీయ పాఠశాలను అభివృద్ధి చేస్తుంది. అత్యుత్తమ ప్రమాణాతో క్రికెట్‌ శిక్షణ, విద్యాబోధన కూడా అందేలా అకాడమీని తీర్చిదిద్దనున్నారు.
  • క్రికెట్‌తోపాటు ఇతర క్రీడలకు అవసరమైన 24 క్రీడా మైదానాలను, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియాలను, మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. 

views: 1075

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams