Current Affairs Telugu Daily

యూరప్‌ దేశాలపై భారీ సైబర్‌ దాడి
సైబర్‌ ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌తో 2017 జూన్‌ 27న మరోమారు యూరప్‌ దేశాలపై  విరుచుకుపడ్డారు. దీంతో రష్యా, ఉక్రెయిన్‌, బ్రిటన్‌, స్పెయిన్‌ తదితర దేశాలల్లో కార్యకలాపాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. నెల రోజుల కిందటే ప్రపంచమంతా ర్యాన్సమ్‌వేర్‌ వాన్నాక్రై వైరస్‌ ధాటికి విలవిలాడిన పరిస్థితి తెలిసిందే. ఈ సైబర్‌ దాడితో అన్ని దేశాకంటే ఎక్కువగా నష్టపోయింది ఉక్రెయినే అని ఆ దేశ ప్రధాని అన్నారు. ఎయిర్‌పోర్టు, కంపెనీల కార్యాయాలన్నీ దాడికి గురయ్యాయని, గతంలో ఎప్పుడూ ఇంత నష్టాన్ని చవిచూడలేదని పేర్కొన్నారు.
views: 984



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams