Current Affairs Telugu Daily

‘ఈవీఎం- ఒక వాస్తవిక కథ’ పుస్తకావిష్కరణ
దేశంలో తొలిదశ బ్యాలెట్‌ ఎన్నికల నుంచి ఈవీఎం-వీవీప్యాట్ల వినియోగం వరకు వచ్చిన మార్పుపై కేంద్ర ఎన్నిక సంఘం మాజీ ఉప కమిషనర్‌ అలోక్‌శుక్లా రాసిన ‘ఈవీఎం-ఒక వాస్తవిక కథ’ పుస్తకాన్ని 2018 నవంబర్‌ 16న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఆవిష్కరించారు.
  • కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్లు వీఎస్‌ సంపత్‌, జేఎం లింగ్డో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి, పుస్తక రచయిత అలోక్‌ శుక్లా, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్యలు పుస్తకాన్ని విడుదల చేశారు. 

views: 1018



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams