Current Affairs Telugu Daily

ATM  గోల్డెన్‌ జూబ్లీ
2017 జూన్‌ 27న ATM 50 సం॥లు పూర్తి చేసుకుని గోల్డెన్‌ జూబ్లీని జరుపుకుంది. 1967 జూన్‌ 27న లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌ టౌన్‌లో బార్‌క్లేస్‌ బ్యాంక్‌ తన ఎన్‌ఫీల్డ్‌ బ్రాంచి వద్ద ప్రపంచంలోనే తొలిసారిగా ATMను ఏర్పాటు చేశారు. స్కాట్లాండ్‌కు చెందిన స్టీఫర్డ్‌ బారెన్‌ అనే ఇంజినీర్‌ బృందం ఈ మిషెన్‌ను తయారు చేశారు. తొలి 6 ట్రాన్సాక్షన్స్‌ను బ్యాంకే చేసుకోగా.. ఈ మిషన్‌ నుంచి తొలిసారిగా డబ్బు విత్‌డ్రా చేసుకున్న వ్యక్తి ప్రముఖ బ్రిటిష్‌ నటుడు రెగ్‌వార్న్‌. ఇతను బ్రిటీష్‌ టీవీ కామెడీ షో ‘ఆన్‌ ది బసెస్‌’లో నటించాడు. ఈ ATM 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో బార్‌క్లేస్‌ బ్యాంక్‌ సిబ్బంది స్వర్ణోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ATMకు బంగారు వర్ణంలోకి మార్చడమేగాక దాని ముందు ఎర్రతివాచీ కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రపంచ తొలి బంగారు ATMగా రూపాంతరం చెందింది. మొదట్లో 6 అంకెతో పిన్‌ నంబర్‌ ఉండేది. ప్రస్తుతం 4 అంకెకు మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల ATMలు పనిచేస్తున్నాయి.
ATM-Automated Teller Machine

Silver jubilee     - 25th anniversary
Ruby jubilee     - 40th anniversary
Golden jubilee     - 50th anniversary
Diamond jubilee     - 60th anniversary
Sapphire jubilee     - 65th anniversary
Platinum jubilee     - 70th anniversary

views: 1209



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams