Current Affairs Telugu Daily

13వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో నరేంద్రమోడి ప్రసంగం
సింగపూర్‌లో 2018 నవంబర్‌ 15న జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్‌)లో ప్రధాని నరేంద్రమోడి ప్రసంగించారు.
  • ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందానికి, నౌకాయాన సహకారానికి కూడా భారత్‌ కట్టుబడి ఉందని వెల్లడించారు. జపాన్‌ ప్రధాని షింజో అబె సహా పలువురు ఇతర దేశాల నేతలతో మోడి సమాలోచనలు జరిపారు.
  • ఆసియాన్‌ కూటమిలోని పది దేశాలతో పాటు భారత్‌ సహా మరో 8 దేశాలు ఈఏఎస్‌లో భాగస్వాముగా ఉన్నాయి. ప్రాంతీయంగా శాంతి, సుసంపన్నత, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కూటమి ఆవిర్భవించింది.
  • ‘ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌)- భారత్‌’ శిఖరాగ్ర సదస్సులో కూడా మోడి పాల్గొన్నారు. భారత్‌-సింగపూర్‌ తొలి హ్యాకథాన్‌లో విజేతలుగా నిలిచిన 6 బృందాలను మోడి సత్కరించారు.
  • వీటిలో 3 బృందాలు (ఐఐటీ-ఖరగ్‌పుర్‌, ఎన్‌ఐటీ-తిరుచ్చి, ఎంఐటీ-పుణె) భారత్‌ నుంచి వచ్చాయి. రెండ్రోజుల పర్యటన అనంతరం భారత ప్రధాని మోడి నవంబర్‌ 15 రాత్రి డిల్లీకి చేరుకున్నారు.

views: 866

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams