Current Affairs Telugu Daily

ఆక్స్‌ఫర్డ్‌ వార్షిక పదం ‘టాక్సిక్‌’
ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ వార్షిక పదం-2018గా ‘టాక్సిక్‌’ ఎంపికైంది. వివిధ సందర్భాల్లో, సంఘటనల్లో 2017 నుంచి ప్రజలు ఈ పదాన్ని విస్తృతంగా వాడుతున్నట్లు గుర్తించామని ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
  • వాస్తవానికి విషపూరిత పదార్థాలను సూచించడానికి ఉపయోగించే ఈ పదాన్ని ‘ప్లాస్టిక్‌ విషం’ గురించి ప్రస్తావించేటప్పుడూ పరిగణనలోకి తీసుకుంటున్నారని ఉదాహరణతో సహా వివరించింది.
  • వాస్తవ వినియోగ పరిధిని దాటి కార్యాలయాలు, పాఠశాలలు, సంస్కృతులు, మానవ సంబంధాలు, ఒత్తిళ్లు... ఇలా దేన్ని వివరించడానికైనా ప్రస్తుతం ఇదే పదాన్ని వాడుతున్నారని తమ పరిశోధనలో తేలినట్లు తెలిపింది.
  • ‘టాక్సిక్‌ మాస్క్యులినిటీ’ అనే పదాన్ని ‘మీ టూ’ ఉద్యమం వెలుగులోకి తెచ్చిందని గుర్తు చేసింది. రాజకీయాల్లో సైతం నేత వాక్చాతుర్యం, పార్టీల విధానాలు తదితర అంశాలను వివరించడానికి ప్రపంచ వ్యాప్తంగా ‘టాక్సిక్‌’ పదాన్ని వినియోగిస్తున్నారని పేర్కొంది.

views: 967



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams