Current Affairs Telugu Daily

సూర్యుడికి పొరుగునే మరో గ్రహం
ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుడికి పొరుగునే మరో గ్రహాన్ని (సూపర్‌ ఎర్త్‌) కనుగొన్నారు. ఇది నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.
  • సూర్యుడికి 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బర్నార్డ్స్‌ నక్షత్రం చుట్టూ ఈ సూపర్‌ ఎర్త్‌ తిరుగుతున్నట్లు గుర్తించారు. బ్రిటన్‌లోని క్వీన్‌ మేరీ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
  • భూమికి కేవలం 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమికన్నా మూడు రెట్లు పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై మైనస్‌ 170 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉందని, బర్నార్డ్స్‌ చుట్టూ పరిభ్రమించడానికి దీనికి 233 రోజులు పడుతుందని అంచనా వేశారు.
  • రాళ్లు, మంచుతో కూడిన ఈ గ్రహంపై నీటి వనరులు పుష్కమని, కానీ, కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నివాసానికి అనుకూలంగా ఉండేదని ఖగోళ శాస్త్రవేత్త గుల్లెమ్‌ అంగ్లడ ఎస్కుడే పేర్కొన్నారు.
  • కనుగొనడానకి ముందు శాస్త్రవేత్తలు ఈ గ్రహానికి సంబంధించి 20 ఏళ్లుగా చేస్తున్న సర్వలు, పరిశోధనల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తొలిసారి రేడియల్‌ వెలాసిటీ పద్ధతి సాయంతో ఈ గ్రహాన్ని గుర్తించారు.

views: 843



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams