Current Affairs Telugu Daily

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3-డీ2 ప్రయోగం విజయవంతం 
భారత్‌ 2018 నవంబర్‌ 14న అత్యంత భారీ వాహకనౌక (రాకెట్‌) సాయంతో బరువైన సమాచార ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
  • జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3-డి2 వాహక నౌక.. 3,423 కిలో బరువున్న జీశాట్‌-29 భారీ ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లురు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో నవంబర్‌ 13న మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ నిరంతరాయంగా 26.18 గంటలపాటు కొనసాగిన తర్వాత నవంబర్‌ 14న సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3-డీ2 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
  • ఈ వాహక నౌక జీశాట్‌-29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లింది. ఇందుకు 16.43 నిమిషాల సమయం తర్వాత క్షిత జియోసింక్రనస్‌ కక్ష్యకు చేరుకుంది. ఆన్‌బోర్డ్‌ ప్రొప్షన్‌ వ్యవస్థ ద్వారా ఉపగ్రహాన్ని తుది జియోస్టేషనరీ కక్ష్యలో ఉంచుతారు.
  • ఇస్రో ఈ ఏడాది చేపట్టిన ఐదో ప్రయోగమిది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాతో కూడిన అంతర్జాల సేవల్ని అందుబాటులోకి తీసుకురావడమే తాజా ప్రయోగం లక్ష్యం.
జీశాట్‌-29 ప్రత్యేకతలు..
  • ఈ సమాచార ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది ఇస్రో రూపొందించిన 33వ సమాచార ఉపగ్రహం. కక్ష్యలోకి చేరిన బరువైన భారత ఉపగ్రహంగా పేరొందింది.
  • దీనిని పలురకాల సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల పరీక్ష వేదికగా ఉపయోగించాలని ఇస్రో భావిస్తోంది. ఇందులో అమర్చిన కేఏ, కేయూ బ్యాండ్‌ హైత్రోపుట్‌ ట్రాన్స్‌పాండర్ల వల్ల ఈశాన్యం, జమ్ముకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాల సేవలు సులభతరమవుతాయి.
  • ఇందులో అమర్చిన అత్యాధునిక కెమెరా 55 మీటర్ల రిజొల్యూషన్‌తో చిత్రాలను తీస్తుంది. 2018 నవంబర్ 18 నుంచి దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. పదేళ్లపాటు సేవలు అందిస్తుంది.
జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3-డీ2..
  • ఇది 5వ తరం వాహకనౌక. ఇస్రో అభివృద్ధి పరిచింది. 4 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను భూ బదిలీ కక్ష్య (జీటీవో)లోకి చేర్చేలా తీర్చిదిద్దారు. శ్రీహరికోట సతీశ్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన 67వ వాహక నౌక ప్రయోగం.

views: 792

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams