Current Affairs Telugu Daily

తెలుగులో ఆక్స్‌ఫర్డ్‌ ఆన్‌లైన్‌ డిక్షనరీ
ప్రపంచవ్యాప్తంగా 100 భాషల డిక్షనరీలను రూపొందించాలని నిర్ణయించిన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ ముద్రణాయం(ఓయూపీ) తెలుగులో కూడా ఆన్‌లైన్‌ డిక్షనరీని అందుబాటులోకి తీసుకురానుంది.
  • ప్రపంచ భాషుల పేరిట 2015 సెప్టెంబరు నుంచి ఈ బృహత్‌ ప్రణాళికలకు ఓయూపీ శ్రీకారం చుట్టింది. వివిధ భాషావేత్తలు, విద్యార్థులు, భాషాభివృద్ధికి కృషి చేసే వారి కోసం పలు భాషల శబ్ద కోశాలను రూపొందించి, వాటిని ఒక శబ్ద భాండాగారంగా పదిలపరిచి ఒకే లింకు ద్వారా అందుబాటులో ఉంచాలన్నది ప్రణాళిక లక్ష్యం.
  • ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రజాదరణ పొందుతున్న భాష జాబితాలో ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు విభాగం తెలుగు భాషను కూడా చేర్చింది. మనదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన భాషల్లో తెలుగు 4వ స్థానంలో నిలిచింది. 

views: 839



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams