Current Affairs Telugu Daily

డి.సి సర్క్యూట్‌ అప్పీళ్ల న్యాయస్థానం న్యాయమూర్తిగా నియోమీ రావ్‌ 
ప్రముఖ భారతీయ అమెరికన్‌ న్యాయవాది నియోమీ రావ్‌కు అమెరికాలో కీలక పదవి లభించనుంది.
  • శక్తిమంతమైన డి.సి(డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా) సర్క్యూట్‌ అప్పీళ్ల న్యాయస్థానం న్యాయమూర్తిగా ఆమెను దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు. వైట్‌హౌస్‌లోని చరిత్రాత్మక రూజ్‌వెల్ట్‌ రూమ్‌లో 2018 నవంబర్‌ 13న నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
  • అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత శక్తిమంతమైన న్యాయస్థానంగా ‘డి.సి.సర్క్యూట్‌’ను పరిగణిస్తారు. 45 ఏళ్ల నియోమీ రావ్‌ ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వంలో ‘సమాచార, క్రమబద్ధీకరణ వ్యవహారాల కార్యాలయం(ఓఐఆర్‌ఏ)’ పాలనాధికారిగా ఉన్నారు.
  • ‘డి.సి.సర్క్యూట్‌’కు నియోమీ నామినేషన్‌ను సెనేట్‌ ఆమోదిస్తే, శ్రీనివాసన్‌ తర్వాత ఆ కోర్టులో నియమితులైన రెండో భారతీయ అమెరికన్‌ న్యాయమూర్తిగా ఆమె చరిత్ర పుటల్లోకెక్కుతారు.

views: 709



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams