Current Affairs Telugu Daily

రాజధాని, శతాబ్దిల్లో ప్రాజెక్ట్‌ స్వర్ణ్‌
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో 2017 అక్టోబరు నుంచి మరిన్ని అదనపు హంగులు సమకూరనున్నాయి. వీటిలో ప్రయాణికులకు ఆహార పదార్థాలను అందించేందుకు విమానాల్లో మాదిరిగా ట్రాలీతో సిబ్బంది వస్తారు. సరికొత్తగా ఆకర్షణీయ యూనిఫాం దుస్తుల్లో వారంతా కనిపిస్తారు. మర్యాదపూర్వక సేవలు అందిస్తారు. మంచి ప్రయాణ అనుభూతిని కలిగించడానికి ఇలాంటి ముఖ్యమైన రైళ్లలో అదనపు వసతుల్ని కల్పించనున్నారు. రూ.25 కోట్ల వ్యయంతో 15 రాజధాని, 15 శతాబ్ది రైళ్లలో మార్పులు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ స్వర్ణ్‌ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. పెట్టెల లోపల భాగాలు, మరుగుదొడ్లు సహా మొత్తం అంతా అధునాతనంగా మారుస్తున్నారు. ఈ రైళ్లన్నీ కచ్చితంగా సమయానికి నడిచేలా ప్రాధాన్యమివ్వనున్నారు.
views: 1072

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams