Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టులో 14కు పెరిగిన ధర్మాసనాలు 
సుప్రీంకోర్టులో మరో 3 ధర్మాసనాలు పెరిగాయి. ఇటీవల నలుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది.
  • ఈ నేపథ్యంలో ధర్మాసనా సంఖ్య పెంచాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి నిర్ణయించారు.
  • ఇప్పటివరకు 11గా ఉన్న ధర్మాసనా సంఖ్య 2018 నవంబర్‌ 13 నుంచి 14కు పెరిగింది. 12వ ధర్మాసనంలో జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ దీపక్‌గుప్తా, 13వ ధర్మాసనంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షా, 14వ ధర్మాసనంలో జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలు వాదనలు విననున్నారు.
  • నూతన రోస్టర్‌ విధానం 2018 నవంబర్‌ 19 నుంచి అమలులోకి వస్తుందని సీజేఐ స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనల వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి వింటారు. సబ్జెక్టు వారీగా రోస్టర్‌ విధానాన్ని మాజీ సీజేఐ దీపక్‌మిశ్ర 2018 ఫిబ్రవరిలో ప్రారంభించారు.

views: 843

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams